Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణాపై CB CID విచారణకు ఆదేశం..! 17 d ago
మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై CB CID విచారణకు ఆదేశించామని తెలిపారు. గంగవరం, కృష్ణపట్నం, విశాఖ పోర్టుల కంటే..కాకినాడ పోర్టులోనే భారీగా అక్రమ రవాణా జరుగుతుందని నాదెండ్ల అన్నారు. అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. కొందరు అధికారుల పాత్ర ఉన్నట్టు సమాచారం ఉందన్నారు. ఇప్పటి వరకు 1,066 కేసులు నమోదు చేశామని చెప్పారు.